సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naveen Chandra: నవీన్ చంద్ర 'హనీ' వచ్చేది ఎప్పుడంటే

ABN, Publish Date - Jan 01 , 2026 | 01:08 PM

  నవీన్ చంద్ర (Naveen Chandra), దివ్య పిళ్లై (Divya Pillai)ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ (Karuna kumsr)రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ హారర్ మూవీ 'హనీ

 
నవీన్ చంద్ర (Naveen Chandra), దివ్య పిళ్లై (Divya Pillai)ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ (Karuna kumsr)రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ హారర్ మూవీ 'హనీ'. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

దర్శకుడు మాట్లాడుతూ 'నిజ జీవిత సంఘటనల  ప్రేరణతో తెరకెక్కిన చిత్రమిది. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది' అని చెప్పారు. ఈ  చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. అజయ్ అరసాడ సంగీతం అందిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నగేష్ బన్నెల్   సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హనీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనగోలు చేసింది.
 

Updated Date - Jan 01 , 2026 | 01:47 PM