ఆ రోజు నన్ను తప్పుపట్టారు: నరేశ్ విజయకృష్ణ
ABN, Publish Date - May 11 , 2026 | 11:50 AM
తమిళనాడులో విజయ్ అధికారం చేపతాడని తాను ఎన్నికల ముందే ఊహించానని సీనియర్ నటుడు నరేశ్ చెప్పారు. అప్పుడు తనను ఎగతాళి చేసివారు ఆ తర్వాత సారీ చెప్పారని అన్నారు.
ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టార్ హీరో జోసఫ్ విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఓ సినిమా ప్రారంభోత్సవంలో సీనియర్ నటుడు నరేశ్ విజయ్ కృష్ణ (Naresh Vijaya Krishna) ఏబీయన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు.
విజయ్ ఖచ్చితంగా అధికారం చేపడతాడని ఎన్నికలు జరిగిన మర్నాడే తాను చెప్పానని అన్నారు. తమిళనాడు ఎన్నికలు ముగిసిన మర్నాడు ఏప్రిల్ 24న విజయ్ అధికారం చేపడతాడని చెప్పానని, అయితే కొందరు స్నేహితులు తనను అవహేళన చేశారని నరేశ్ తెలిపారు. ఎన్నికలు అయిన తర్వాత తాను తన అంచనాలకు తగ్గట్టుగా ప్రిడిక్షన్ చెబుతుంటానని, ఎన్నికల విశ్లేషణకుడిగా తను చెప్పిన పార్టీ విజయం సాధించడం ఇది ఎనిమిదవసారి అని నరేశ్ అన్నారు. ఓ సాధారణ పౌరుడిగా విజయ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. తన ట్వీట్‌ను పాజిటివ్‌గా తీసుకున్నవారికి, బలపర్చిన వారికి, దానిని విమర్శించ వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ నరేశ్ ట్వీట్ చేశారు. తనను ఎగతాళి చేసిన కొందరి ట్వీట్స్ ను ఆయన దానితో పాటు జత పర్చారు.
ఇదిలా ఉంటే ఏబీయన్ ఆంధ్రజ్యోతితో నరేశ్ విజయకృష్ణ మాట్లాడుతూ, 'చెన్నయ్‌లోని నా స్నేహితులు ఎన్నికల మర్నాడు నేను పెట్టిన ట్వీట్ చూసి విజయ్‌కు రెండు సీట్లు వస్తాయని, నా జోస్యం తప్పు అవుతుంద'ని అన్నారు. తర్వాత వాళ్ళే సారీ చెప్పారు. 'నేను బీజేపీలో వర్క్ చేశాను. నాకున్న పరిజ్ఞానం ప్రకారం తమిళ ప్రజలు రాజకీయాల్లో కొత్తదనం కోరుకున్నారు. అందుకే విజయ్ కు పట్టం కట్టారు. విజయ్ మేనిఫెస్టో కూడా బాగుంది. ఎన్టీఆర్ (NTR), ఎంజీఆర్ (MGR) సరసన విజయ్ నిలిచాడు. సినిమా వాళ్ళకు పాలిటిక్స్ లో ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి సిఎంలు, డిప్యూటీ సిఎంలు అవుతారు' అని అన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి చెబుతూ, 'ఈరోజు పవన్ కల్యాణ్ కూడా సాలీడ్ పొలిటీషియన్ గా మారారు. ప్రధాని మోదీ పవన్ ఇంటికి వెళ్లటం సామాన్యమైన విషయం కాదు. రెండు రాష్ట్రాల్లో సినిమా వారు రాజకీయంగా కీలక స్దానాల్లో ఉండటం చెప్పుకొదగ్గ విషయం. ఇక విజయ్ విషయానికి వస్తే ఆయన విజయ్ కింగ్ మేకర్‌తో పాటు కింగ్ కూడా అయ్యారు' అని అన్నారు.