ఆదర్శ కుటుంబంలో నారాయణమ్మ.. మోత మోగించిందమ్మా
ABN, Publish Date - Sep 27 , 2026 | 07:20 PM
విక్టరీ వెంకటేష్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రతి సినిమాభిమానికి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కాంబినేషన్ అనగానే ప్రతి సినిమాభిమానికి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు, పంచిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులకు బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచాయి. ఇప్పుడు చాలా ఏళ్ల విరామం తర్వాత వీరి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం ( Aadarsha Kutumbam). శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ అంటూ సాగే ఒక స్పెషల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ స్పెషల్ సాంగ్ లో అందాల భామ డింపుల్ హయాతి డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ స్వరపరిచిన ఈ పాట పార్టీలో సాగుతున్నట్లు విజువల్స్ బట్టి తెలుస్తోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ అందించిన క్యాచీ సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక రామ్ మిరియాల, ప్రభ తమ వాయిస్ తో సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. గ్రాండ్ విజువల్స్.. డింపుల్, నివేతా, వెంకీ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా వెంకటేష్ మార్కు వింటేజ్ స్టైల్ ఆకట్టుకున్నాయి. నారాయణమ్మ సాంగ్ సోషల్ మీడియాలో మోత మోగించేయడం ఖాయమని తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐటెమ్ సాంగ్ అయినా కూడా హీరోయిన్స్ చిన్న చిన్న బట్టలు వేసుకోకుండా చీరల్లోనే దర్శనమిస్తారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో, గుంటూరు కారం.. ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో కూడా హీరోయిన్స్ చీరల్లో కనిపించి కనువిందు చేశారు. చీరలో కూడా డింపుల్ హాట్ నెస్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంపై నారాయణమ్మ పాటతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ మరియు వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబో మేజిక్‌ను కోరుకునే ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ఆదర్శ కుటుంబం చిత్రం అక్టోబర్ 9 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వెంకీ - త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.