సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నారా రోహిత్ జోరు.. మాములుగా లేదు

ABN, Publish Date - Jul 25 , 2026 | 05:41 PM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ (Nara Rohith). సుందరకాండ సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న రోహిత్..

Nara Rohith

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ (Nara Rohith). సుందరకాండ సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న రోహిత్.. ఇక నుంచి మంచి కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో సంచలనం సృష్టిస్తున్న నారా రోహిత్ నేడు తన 42 వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఒక్కసారిగా క్రేజీ అప్‌డేట్స్ ఇస్తూ సినిమా పోస్టర్లను విడుదల చేసి అభిమానులకు ఊహించని బహుమతిని అందించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తూ నారా రోహిత్ జోష్ పెంచాడు.


నారా రోహిత్ నటిస్తోన్న చిత్రాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసాఫీసర్ గా సీరియస్ లుక్ లో కనిపించాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇది వర్క్అవుట్ అయితే మాత్రం ఇండస్ట్రీకి మరో విలన్ దొరికినట్టే.


ఇక అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ మల్టీస్టారర్‌తో పాటు ఆయన 23వ చిత్రానికి సౌండ్ ఇంజనీర్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. ఎథో ప్రశాంతంగా యోగా చేస్తున్నట్లు రోహిత్ పోస్టర్ ఆసక్తికరంగా కనిపించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో పాటు, కపాలి అనే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ నుంచి రోహిత్ రఫ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.ఒకేసారి మాస్, క్లాస్, హారర్, మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లతో రీ-ఎంట్రీలో విపరీతమైన స్పీడు మీదున్న నారా రోహిత్ తన రాబోయే చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Jul 25 , 2026 | 05:42 PM