సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేలా..

ABN, Publish Date - Aug 08 , 2026 | 04:34 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా తరువాత శ్రీకాంత్ ఓదెల - నాని కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో కచ్చితంగా ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

The Paradise

నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా తరువాత శ్రీకాంత్ ఓదెల - నాని కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో కచ్చితంగా ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. టీజర్‌ను కట్ చేసిన విధానం వల్ల అసలు కథేంటో, నాని ఏం మాట్లాడుతున్నాడో సాధారణ ప్రేక్షకుడికి ఏమాత్రం బోధపడలేదు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఎవరికీ అర్థం కాని టీజర్ అంటూ విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. డైలాగ్స్ ఇంత ఫాస్ట్‌గా ఉంటే అసలు ఆడియన్స్‌కి ఎలా కనెక్ట్ అవుతుందని, పాత్రలోని ఇంటెన్సిటీ చూపించే క్రమంలో స్పష్టతను పూర్తిగా విస్మరించారని విమర్శలు గుప్పిస్తున్నారు.


అయితే, ఈ వివాదం కేవలం భాష లేదా పదజాలం గురించే కాకుండా, టీజర్‌లోని కట్, డైలాగ్ డెలివరీ వేగంపైనే ప్రధానంగా సాగుతోంది. టీజర్‌లో నాని చెప్పిన తెలంగాణ యాస డైలాగులు అత్యంత వేగంగా రావడం, నేపథ్య సంగీతం హోరులో ఆ భాష స్పష్టంగా అర్థం కాకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో మేకర్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి పూనుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకున్న మేకర్స్ వెంటనే టీజర్ ని రీ-ఎడిట్ చేసి మళ్లీ రీ-రిలీజ్ చేశారు.


ఇక ఈ రీరిలీజ్ టీజర్ లో డైలాగ్స్ అర్ధం అవ్వడంతో పాటు కొద్దిగా మ్యూజిక్ కూడా తగ్గింది. దీంతో కొంచెం అయినా ట్రోల్స్ తగ్గుతాయని మేకర్స్ అనుకున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ట్రోల్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయని, ఇప్పుడు రీ-రిలీజ్‌లపై దృష్టి పెట్టకుండా, రాబోయే ట్రైలర్‌నైనా చక్కగా కట్ చేసి, డైలాగ్స్ స్పష్టంగా వినిపించేలా జాగ్రత్తపడితేనే సినిమాపై ఉన్న హైప్ నిలబడుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ప్యారడైజ్ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే సెప్టెంబర్ 24 వరకు ఆగాల్సిందే.

Updated Date - Aug 08 , 2026 | 05:16 PM