Nani: ‘ది ప్యారడైజ్‌’కు A సర్టిఫికెట్‌? ట్రైలర్‌ ఎందుకు రాలేదంటే.. నాని క్లారిటీ!

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:29 PM

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నాని ఇంతకుముందెన్నడూ కనిపించని ‘జడల్‌’ అనే పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో నాని వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా కొచ్చిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘ది ప్యారడైజ్‌’కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను నాని వెల్లడించారు. సినిమాకు ఇంకా సెన్సార్‌ పూర్తికాలేదని, ‘A’ సర్టిఫికెట్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలా జరిగితే పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడలేరన్న విషయం నిజమేనని అన్నారు. 

నాని మాట్లాడుతూ "నేను ఒకే జానర్  సినిమాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదు.  నటుడిగా అన్ని రకాల జానర్లను ప్రయత్నించాలనుంది. ‘ది ప్యారడైజ్‌’ తర్వాత  విభిన్నమైన కథలు, పాత్రలు చేయాలని ఉంది. మరో రెండు సినిమాల తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’ తరహాలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకుంటున్నాను. త్వరలోనే అలాంటి సినిమా నా నుంచి వస్తుంది. ఇక ‘ది ప్యారడైజ్‌’ ట్రైలర్‌ ఎందుకు విడుదల చేయలేదనే విషయానికి వస్తే.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందుకే ట్రైలర్‌ను తీసుకురాలేకపోయాం. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. వాటన్నింటినీ ముందుగానే చూపించడం నాకు ఇష్టం లేదు. ప్రేక్షకులు వాటిని నేరుగా థియేటర్‌లో చూస్తేనే ఆ అనుభూతి బాగుంటుంది. అందుకే సినిమా గురించి ఎక్కువ విషయాలను బయటపెట్టకుండా ఉంచుతున్నాం. ‘హిట్‌ 3’ ప్రచారం కోసం కొచ్చికి వచ్చాను. ఏడాదిన్నర గడిచినా నాకు నిన్ననే ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడి ప్రేక్షకులు నాకు చూపించే ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. మలయాళ సినిమాలంటే నాకు మొదటి నుంచీ చాలా ఇష్టం. ఈ ఇండస్ట్రీని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు' అని నాని చెప్పారు. 

ALSO READ:
Raaka: 'రాకా’పై శిబి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా

Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు





Updated Date - Sep 19 , 2026 | 05:10 PM