సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nani: నాటి క్లాప్ బాయ్.. నేటి స్టార్ ప్రొడ్యూసర్

ABN, Publish Date - Aug 03 , 2026 | 03:54 PM

చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో, ఎవరి జాతకం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సినీ పరిశ్రమలో కేవలం లక్ మాత్రమే సరిపోదు, కష్టపడే తత్వం (హార్డ్ వర్క్) చాలా ముఖ్యం.

Nani

చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో, ఎవరి జాతకం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సినీ పరిశ్రమలో కేవలం లక్ మాత్రమే సరిపోదు, కష్టపడే తత్వం (హార్డ్ వర్క్) చాలా ముఖ్యం. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మారడమే ఒక పెద్ద అద్భుతం అయితే, అసిస్టెంట్ డైరెక్టర్‌ స్థాయి నుంచి సొంతంగా సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్‌గా మారడం మరో మైలురాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని (Nani) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.


కెరీర్ ప్రారంభంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అల్లరి బుల్లోడు చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్లాప్ బాయ్‌గా పనిచేశాడు. ఆ తరువాత హీరోగా మారి.. మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. కేవలం హీరోగా మాత్రమే కొనసాగకుండా నిర్మాతగా మారి చిన్న సినిమాలను తెరకెక్కించి తనలా కష్టపడి పైకి వచ్చే కొత్తవారికి అండగా నిలుస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే నితిన్ హీరోగా నాని తన బ్యానర్ లో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రమే 'అలియాస్ రుక్మిణి. దండోరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు.


సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నానినే క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టాడు. ఒకప్పుడు క్లాప్ బాయ్ గా నితిన్ సినిమాకు క్లాప్ కొట్టిన నాని.. సరిగ్గా అదే నితిన్ చిత్రానికి ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి, తిరిగి అదే హీరో సినిమాకి క్లాప్ కొట్టడం అసలైన సక్సెస్ అంటే ఏంటో నిరూపించింది. కష్టపడి పైకి వచ్చిన ప్రతీ ఒక్కరికీ నాని ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు క్లాప్ కొట్టిన చేతులతోనే, ఈరోజు తన సొంత కష్టంతో అదే హీరో సినిమాని నిర్మించే స్థాయికి నాని చేరుకోవడం ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్‌కి దక్కిన నిజమైన గౌరవం. ఇది కదా రియల్ సక్సెస్ అంటే అని నని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని - నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 04:14 PM