సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్లడీ రోమియో.. ఏం లుక్ రా బాబు.. మెంటలెక్కేసింది

ABN, Publish Date - Oct 10 , 2026 | 05:36 PM

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈ మధ్యనే ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Bloody Romeo,

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) ఈ మధ్యనే ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని నాని కూడా ఒప్పుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నాని కొత్త సినిమాని పట్టాలెక్కించేశాడు. ప్యారడైజ్ సెట్స్ మీద ఉన్నప్పుడే దర్శకుడు సుజీత్ తో బ్లడీ రోమియో సినిమాని ప్రకటించిన విషయం తెల్సిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.


ఈ గ్లింప్స్‌లో నాని పూర్తిగా కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అదరగొట్టేశారు. హీ వాక్స్ లైక్ ది స్ట్రీట్స్ టేకింగ్ ఎవ్రీ స్టెప్... అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న వాయిస్ ఓవర్, విజువల్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ముఖ్యంగా 'బ్లడీ రోమియో - ది కిచెన్ ఓపెన్స్ సూన్' అనే క్యాప్షన్ ఈ సినిమా ఏ జోనర్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. సుజిత్ మార్క్ టేకింగ్, నాని ఈజ్ అండ్ యాటిట్యూడ్ కలిసి ఈ గ్లింప్స్ ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇక ఇప్పటివరకు జడల్ లుక్ లో కనిపించిన నాని కొత్త లుక్ లోకి మారిపోయాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.


న్యాచురల్ స్టార్ నుంచి వస్తున్న తొలి కంప్లీట్ యాక్షన్-స్టైలిష్ ఎంటర్‌టైనర్ కావడంతో అన్ని వర్గాల ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నాని లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏం లుక్ రా బాబు మెంటలొచ్చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 10 , 2026 | 05:37 PM