నితిన్ తో నాని కొత్త సినిమా ప్రారంభం.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Aug 02 , 2026 | 03:12 PM
నేచురల్ స్టార్ నాని ఒకవైపు వరుస సినిమాలతో హీరోగా బిజీగా ఉంటూనే, మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని (Nani) ఒకవైపు వరుస సినిమాలతో హీరోగా బిజీగా ఉంటూనే, మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అభిమానులంతా 'ది ప్యారడైజ్' టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. నాని తన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. నితిన్ (Nithiin) హీరోగా నటించనున్న ఈ సినిమాకు 'దండోరా' సినిమా దర్శకుడు మురళీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా సోమవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా వైష్ణవి చైతన్య నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ALSO READ:
Allu Arjun: స్టార్‌డమ్ మారినా.. స్నేహితులు మారలేదు.. అదే అల్లు అర్జున్!
Raashii Khanna: సంతోషంలో కాదు.. కష్టాల్లో తోడుండేవారే అసలైన స్నేహితులు
‘కాక్‌టెయిల్ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?