బాక్సాఫీస్ వద్ద.. ‘ది ప్యారడైజ్’ సునామీ!
ABN, Publish Date - Sep 25 , 2026 | 09:42 AM
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో దూసుకెళుతోంది.
నేచురల్ స్టార్ నాని (nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (srikanth)కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’(The paradise) . దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టే బుకింగ్స్ లో కూడా ది ప్యారడైజ్ జోరు క్లియర్‌గా కనిపించింది. ప్రీ బుకింగ్స్ పరంగా మొదటి రోజే 60 కోట్ల కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.
తాజాగా మూవీ యూనిట్ దీనికి సంబంధించి అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఫ్యాన్స్ కూడా జడల్ జమానా షురూ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు సినిమాకు మిశ్రమ స్పందనను దక్కించుకున్నప్పటికీ అనేక ప్రాంతాలలో థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతూ దూసుకెళుతోంది. అంతేగాక వినాయక నిమజ్జనం, శని ఆది వరుస సెలవులు కూడా వస్తుండడంతో రెండు మూడు రోజుల వరకు ప్యారడైజ్ భారీ వసూళ్లను సాధించడమే గాక లాభల బాటలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.