‘ది ప్యారడైజ్’ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే..
ABN, Publish Date - Feb 12 , 2026 | 07:38 PM
నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా విడుదల వాయిదా పడింది.
నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా విడుదల వాయిదా పడింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగస్టు 21కి (The Paradise release date) వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ గురువారం ప్రకటించింది.
దసరా చిత్రం తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మోహన్‌బాబు, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సినిమాను మించి ఈ సినిమా ఉంటుందని నాని ఇప్పటికే చెప్పారు.