సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise Teaser: తూ అన్న కాకులు తల్వార్ పడితే..

ABN, Publish Date - Aug 06 , 2026 | 06:20 PM

నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్.

The Paradise Teaser

నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ నుండి వస్తున్న రెండవ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా శ్రీకాంత్ ఓదెల మార్క్ జడల్ జమానాను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.


సుమారు 1 నిమిషం 43 సెకన్ల నిడివితో సాగిన ఈ టీజర్ ఆద్యంతం అత్యంత రఫ్‌గా, డార్క్ థీమ్‌తో, విపరీతమైన రక్తపాతం, ఊరమాస్ యాక్షన్ విజువల్స్‌తో కట్టిపడేసింది. జడల్ అనే పవర్‌ఫుల్ అండ్ వైలెంట్ క్యారెక్టర్‌లో నాని షర్ట్‌లెస్ అండ్ రగ్గడ్ లుక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. హక్కుల కోసం పోరాడే ఒక నాయకుడి వైలెన్స్, రా ఎమోషన్స్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన విలక్షణమైన టేకింగ్‌తో ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా ఆవిష్కరించాడు. తమ జాతిని తక్కువ చేసేవారిపై జడల్ యుద్దం ప్రకటించడం.. దానికోసం పోరాడడం, రక్తాన్ని చిందించడం టీజర్ లో చూపించారు.


టీజర్‌కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులకు అనిరుధ్ మ్యూజిక్ తోడవ్వడంతో టీజర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మోహన్ బాబు డైలాగ్ ని బట్టి.. ఈసారి ఆయన నట విశ్వరూపం చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చివర్లో నాని.. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ.. రక్తంతో దిష్టి తీయడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎన్నో వాయిదాల తరువాత ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ టీజర్‌తో ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 06:29 PM