సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్యారడైజ్.. మరోసారి వాయిదా

ABN, Publish Date - Sep 05 , 2026 | 03:17 PM

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండవ సినిమా ది ప్యారడైజ్.

The Paradise

న్యాచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండవ సినిమా ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో విశేషమైన క్రేజ్ ఉంది. కయాదు లోహార్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఇక కీర్తి సురేష్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ప్యారడైజ్ చివరికి సెప్టెంబర్ 24 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒక వారం రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నప్పటికీ, అనుకున్న సమయానికి కొన్ని సాంకేతిక విభాగాలు పూర్తి కాకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సినిమాకు ఎంతో కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనితో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ పనులు కూడా తుది దశకు చేరుకోలేదట. అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని, ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఈ వాయిదా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఉన్న ఒప్పందాలు, స్ట్రీమింగ్ గడువుల ప్రకారం రిలీజ్ ప్లాన్లని సర్దుబాటు చేస్తున్నారని టాక్. ఒకవేళ సెప్టెంబర్ విడుదల కాస్త ఆలస్యమైతే, ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఉన్న సెలవుల సీజన్ సినిమా వసూళ్లకు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇందులో నిజమెంత అని తెలియాల్సి ఉంది.

Updated Date - Sep 05 , 2026 | 03:17 PM