ద ప్యారడైజ్‌లో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ ప్రారంభం
ABN, Publish Date - Feb 09 , 2026 | 06:45 PM
'ద ప్యారడైజ్' మూవీ అప్‌డేట్స్ ప్రతిసారీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పోస్టర్ రిలీజ్ నుంచి షూటింగ్ ప్రారంభం వరకు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఫ్యాన్స్ ను ఆనందపడేలా చేస్తోంది.
నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ 'ద పారడైజ్'. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
హీరో నాని ఇంట్రడక్షన్ సాంగ్ 'ఆయా షేర్' షూటింగ్ భారీ సెట్‌లో ప్రారంభమైంది. వందలాది మంది డ్యాన్సర్లతో కలిసి లావిష్‌గా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్‌కు మాస్ వైబ్స్‌తో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ ట్యూన్ ను అందించారు. నాని డ్యాన్స్ స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయేలా ఈ ట్రాక్ రూపొందించారని తెలుస్తోంది.
ఇటీవల విజయ్ 'జన నాయగన్'లో పనిచేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఈ సాంగ్‌ను గూస్‌బంప్స్ వచ్చేలా తీర్చిదిద్దుతున్నారట. నాని సిగ్నేచర్ మ్యాడ్‌నెస్, డైనమిక్ మూవ్స్‌తో స్క్రీన్‌ను పూర్తిగా డామినేట్ చేయబోన్నాడట. ఈ సాంగ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి అంశంలోనూ ఎంతో శ్రద్ధ చూపిస్తూ 'ద పారడైజ్'ను తెరకెక్కిస్తున్నారు. కేవలం సాంగ్ ఆప్ డేట్ తోనే హైప్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Read Also: స్పిరిట్ ఇష్యూపై ప్రకాశ్ రాజ్ వివరణ
Read Also: సోగ్గాళ్లు.. మళ్లీ వస్తున్నారు