సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్యారడైజ్ మిక్స్డ్ రివ్యూస్ .. స్పందించిన నాని

ABN, Publish Date - Sep 25 , 2026 | 03:39 PM

నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ది ప్యారడైజ్ (The Paradise) చిత్రం ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు ఈ గురువారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

The Paradise

నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ది ప్యారడైజ్ (The Paradise) చిత్రం ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు ఈ గురువారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జడల్ జమానా షురూ అంటూ నాని ప్రేక్షకుల ముందకు వచ్చాడు. కానీ, జడల్ ని మాత్రం ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు. ప్రీమియర్స్ నుంచే ప్యారడైజ్ మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమాలో వైలెన్స్ ఎక్కువ చూపించారు అని కొందరు.. టేకింగ్ బాలేదని మరికొందరు.. కథ బావున్నా సరిగ్గా తెరకెక్కించలేదని ఏకీపారేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.


'మీ ప్రతిచర్యలు, స్పందనలన్నీ నేను చూశాను. మీ నుంచి లభించిన అపారమైన ప్రేమని స్వీకరించాను, అదే సమయంలో మీ నుండి వచ్చిన హిలేరియస్ ట్రోల్స్‌ని కూడా అంతే సరదాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ సినిమాను తమ స్వంత చిత్రంగా ఓన్ చేసుకున్న విధానం నా హృదయాన్ని తాకింది. అలాగే రివ్యూయర్స్, క్రిటిక్స్ వేలెత్తి చూపిన లోపాల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మీకు ఒక సరికొత్త అనుభూతిని అందించడం కోసం 'ది ప్యారడైజ్' సినిమాను ఎంతో రక్తం, చెమట చిందించి నిర్మించాం. ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదా జడ్జ్ చేయడం అనేది పూర్తిగా మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఈ సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ నాని ఎమోషనల్ అయ్యాడు.


పాజిటివ్ టాక్‌తో పాటు విమర్శలను కూడా ఎంతో హుందాగా స్వీకరించి, ట్రోల్స్‌ను సైతం పాజిటివ్‌గా తీసుకున్న నాని నిజాయితీకి నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక కలక్షన్స్ విషయానికొస్తే.. మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా రూ. 88 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Sep 25 , 2026 | 03:40 PM