సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నితిన్‌తో.. నాని సినిమా! ఈ సారైనా.. హిట్టు ప‌డేనా?

ABN, Publish Date - Jul 12 , 2026 | 07:07 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

Nithiin, Nani

నేచురల్ స్టార్ నాని (Nani) వరుస విజయాలతో దూసుకుపోతున్న పోతున్నాడు. కేవలం నటుడిగానే పరిమితం కాకుండా, 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌ను స్థాపించి అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పటికే విశ్వక్ సేన్ తో 'హిట్', అడివి శేష్ తో 'హిట్ 2', ప్రియదర్శి ప్రధాన పాత్రలో 'కోర్ట్' లాంటి విభిన్నమైన, విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ఒకవైపు నిర్మాతగా విజయాలను అందుకుంటూనే, మరోవైపు హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో 'ది ప్యారడైజ్', సుజిత్ దర్శకత్వంలో 'బ్లడీ రొమియో' లాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.

అయితే, నిర్మాతగా నాని ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. హీరోగా తనతో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు చేపట్టాడు. ఈ మెగా ప్రాజెక్టుతో పాటుగా ఇండస్ట్రీలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బలంగా వినిపిస్తోంది. యువ హీరో నితిన్ (Nithiin)తో నాని ఒక సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 'దండోర' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నాడట. కథాబలమున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల టాక్.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ నితిన్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఆరేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు, 'భీష్మ' తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కు, నాని లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత, కంటెంట్ ను నమ్ముకునే మురళీకాంత్ లాంటి దర్శకుడు తోడైతే కచ్చితంగా అది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి తోడుగా నితిన్, రుక్మిణి వసంత్ ల జోడీ తెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కూడా కేవలం ఇమేజ్ మీద ఆధారపడకుండా బలమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నాని, నితిన్‌ల మధ్య ఉన్న పాత అనుబంధం. నితిన్ హీరోగా వచ్చిన 'అల్లరి బుల్లోడు' సినిమాకు నాని ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాడు అసిస్టెంట్ గా ఉన్న కుర్రాడు, నేడు అదే హీరోతో ఏకంగా ఒక సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన సినీ ప్రయాణమని చెప్పవచ్చు. కాలం తీసుకొచ్చిన ఈ అందమైన మార్పు వారిద్దరి అభిమానులకూ ఒక మధురమైన జ్ఞాపకం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ నుంచి స్పష్టమైన అనౌన్స్ మెంట్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 12 , 2026 | 07:13 PM