సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ట్రైలర్ లేకుండా ప్యారడైజ్.. ఒప్పుకుంటారా నాని

ABN, Publish Date - Sep 11 , 2026 | 08:30 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ప్యారడైజ్. గత కొన్నిరోజుల నుంచి ప్యారడైజ్ వాయిదా.. షూటింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు.

Nani

నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్ (Paradise). గత కొన్నిరోజుల నుంచి ప్యారడైజ్ వాయిదా.. షూటింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. సెట్ లో డైరెక్టర్ ఎవరినో కొట్టాడు.. ఇలా ఎన్నో పుకార్లు పుట్టుకోస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికింది. ఎట్టకేలకు ది ప్యారడైజ్ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టి.. సోషల్ మీడియాలో వచ్చిన అన్నీ పుకార్లకు చెక్ పెట్టింది. సినిమా అనుకున్న సమయానికి.. అనగా మొదటి నుంచి సెప్టెంబర్ 24న వస్తుంది అని ప్రకటించినట్లుగానే రిలీజ్ కానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకు ట్రైలర్ ఏమి ఉండదు అని కూడా నాని స్పష్టం చేశాడు.


ట్రైలర్ ఎందుకు రావడం లేదనే అంశంపై నాని వివరణ ఇస్తూ.. ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతోనో లేక గ్రాంటెడ్ గా తీసుకుని ట్రైలర్ కట్ చేయడం లేదో కాదు. సినిమా అవుట్‌పుట్, క్వాలిటీ కోసం ప్రస్తుతం శ్రీకాంత్, అనిరుధ్ ఇతర టీమ్ మెంబర్స్ అందరూ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పుడున్న తక్కువ సమయంలో ఒక మంచి ట్రైలర్ కట్ చేయాలంటే నాలుగైదు రోజులు పడుతుంది. దానికోసం అసలు పని పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే ట్రైలర్ కంటే సినిమా అవుట్‌పుట్టే ముఖ్యమని భావించి టీమ్ అంతా కలిసి ట్రైలర్ వద్దు అనే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు.


సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా కూడా ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేసుకుందామా అని చూస్తుంటుంది. అందుకే ఫస్ట్ గ్లిమ్స్ కి ఒక ప్రెస్ మీట్.. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ ఇలా రకరకాల పేర్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాలని చూస్తూ ఉంటుంది. కానీ, నాని ప్యారడైజ్ ట్రైలర్ కూడా ఉండదు అనేసరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ట్రైలర్ లో కథను చెప్పకుండా ప్రేక్షకులను అలరించే అంశాలు చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ట్రైలర్ ని కట్ చేసిన విధానాన్ని బట్టే చాలామంది సినిమాకు కూడా వెళ్తుంటారు. అలాంటిది అసలు ట్రైలర్ కూడా లేకపోతే ఫ్యాన్స్ ఎలా ఒప్పుకుంటారు అనేది కొందరి ప్రశ్న. మరికొందరు.. సినిమా వారికే నచ్చలేదేమో.. అందుకే ట్రైలర్ రిలీజ్ చేస్తే ట్రోల్స్ ఎక్కువ అయ్యి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని.. నాని ఇలా చెప్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.


అలాగే వరుసగా యాక్షన్ సినిమాలు చేయడంపై వస్తున్న ప్రశ్నలపై స్పందిస్తూ, తాను ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వలేదని స్పష్టం చేశాడు. 'దసరా', 'హిట్ 3', 'ప్యారడైజ్', 'బ్లడీ రోమియో' వంటి వరుస యాక్షన్ చిత్రాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా విభిన్నమైన జోనర్ లో సినిమా ఉంటుందని హామీ ఇచ్చాడు. 'బ్లడీ రోమియో' తర్వాత చేయబోయే తదుపరి చిత్రం అనౌన్స్‌మెంట్ వస్తే ప్రేక్షకుల ప్రశ్నలన్నింటికీ పూర్తి క్లారిటీ వస్తుందని నాని చెప్పుకొచ్చాడు.

Updated Date - Sep 11 , 2026 | 08:30 PM