సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ugly Story Trailer : ప్రతి నిమిషం ప్రేమించే పోటుగాడు ఎవడు లేడు

ABN, Publish Date - May 06 , 2026 | 12:46 PM

చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హీరోగా మారాడు నటుడు నందు. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్నా.. ఆశించిన విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు.

Ugly Story Trailer

చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. హీరోగా మారాడు నటుడు నందు. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్నా.. ఆశించిన విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. అయినా కూడా సినిమాలు చేయడం ఆపలేదు. తాజాగా నందు (Nandu) హీరోగా తెరకెక్కిన చిత్రం అగ్లీ స్టోరీ (Ugly Story). ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందు సరసన అవికాగోర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అగ్లీ స్టోరీ మే 22 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నందు ఒక సైకోలా కనిపించాడు. చిన్నప్పటి నుంచి హీరోకి.. హీరోయిన్ అంటే పిచ్చి. కానీ, ఆమె మాత్రం వేరొక అబ్బాయిని ఇష్టపడుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవడమే నాకు తెలిసిన ప్రేమ అనుకొనే హీరో.. ఆమెను ఎలా వేధించాడు.. ? బలవంతంగా పెళ్ళిచేసుకొని నరకం చూపిస్తున్నా కూడా హీరోయిన్ ఎందుకు సైలెంట్ గా ఉంది.. ? అసలు హీరోకి ఉన్న సమస్య ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


సైకో పాత్రలో నందు ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్రలు నందుకు కొట్టిన పిండి. అవికా గృహిణిగా అందంగా కనిపించింది. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై ఒక బజ్ ని క్రియేట్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా నందుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - May 06 , 2026 | 12:57 PM