సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా

ABN, Publish Date - Nov 25 , 2026 | 04:53 PM

నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా తొలి సినిమా ప్రారంభమైంది. నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి భువన్ దర్శకత్వం వహిస్తుండగా, వైజాగ్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం.

Nandamuri Tejaswini

నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) నిర్మాతగా మారుతోన్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూతుళ్ళు చాలా అందంగా ఉంటారు. వారు హీరోయిన్స్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారేమో అని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూశారు. కానీ, బ్రాహ్మణి బిజినెస్ విమెన్ గా మారగా .. తేజస్విని ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న ఆమె ఆ తరువాత కెమెరా ముందుకు వచ్చి ఒక యాడ్ తో ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. అందం, అభినయం ఉన్న ఆమె సినిమాల్లో నటిస్తుంది అనుకుంటే.. నిర్మాతగా మారింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.


తాజాగా ఆమె నిర్మిస్తోన్న మొదటి చిత్రం సెట్స్ మీదకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం తేజస్విని నిర్మిస్తోన్న చిత్రంలో యంగ్ హీరో నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి భువన్ దర్శకత్వం వహిస్తున్నాడు, నాగ అన్వేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్ నాగ అన్వేష్.. ఆ తరువాత వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయినా ఏంజెల్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఏంజెల్ తరువాత మధ్యలో గ్యాప్ తీసుకున్న నాగ అన్వేష్ ఇప్పుడు తేజస్విని నిర్మిస్తోన్న సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు.


ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విశాఖపట్నం (వైజాగ్) లోని అందమైన లొకేషన్లలో అధికారికంగా ప్రారంభమైందని సమాచారం. కథా బలం ఉన్న విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ అన్వేష్‌తో పాటు మరో యంగ్ హీరో కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ ప్రధానంగా సాగే ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరమైన కథ కుదరడంతో చిత్ర బృందం ఎంతో ఉత్సాహంతో షూటింగ్ జరుపుతోందట. ఇప్పటికే పలు ప్రాజెక్టుల వెనుక క్రియేటివ్ ఇన్‌పుట్స్‌తో వ్యవహరించిన నందమూరి తేజస్విని, ఈ చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతోంది. వైజాగ్ షెడ్యూల్‌తో మొదలైన ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. మరి ఈ సినిమాతో నందమూరి వారసురాలు నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 25 , 2026 | 05:02 PM