Ntr: ఎన్టీఆర్ 103వ జయంతి..ఘనంగా నివాళి..
ABN, Publish Date - May 28 , 2026 | 10:16 AM
దివంగత మాజీ సీఎం, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (NTR)) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద గురువారం ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.
దివంగత మాజీ సీఎం, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (NTR)) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద గురువారం ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ (jr Ntr) ఉదయం 6 గంటల సమయంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకుని, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. ‘జై ఎన్టీఆర్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ కాసేపు అక్కడ గడిపారు.
సినీరంగంలో ఎన్నో చారిత్రక పాత్రలు పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని అభిమానులు కీర్తించారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు.