బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. నందమూరి వారసుడు వస్తున్నాడు
ABN, Publish Date - Sep 06 , 2026 | 07:51 PM
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshgna Tej) త్వరలోనే కథానాయకుడిగా వెండితెరపై అడుగుపెట్టబోతున్నాడు.
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshgna Tej) త్వరలోనే కథానాయకుడిగా వెండితెరపై అడుగుపెట్టబోతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇండస్ట్రీలో అనేక కథనాలు, ప్రచారాలు నడిచాయి. బాలయ్య వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు, ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అంటూ ప్రతి పండుగకు, ఆయన పుట్టినరోజుకు అభిమానుల్లో తీవ్రమైన చర్చ జరిగేది. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరదించుతూ మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది.
గతంలో మోక్షజ్ఞను ఆదిత్య 369 సీక్వెల్‌తో బాలకృష్ణ స్వయంగా లాంచ్ చేస్తారని, లేదా పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి సీనియర్ దర్శకులు ఆయన బాధ్యతలను తీసుకుంటారని రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు మోక్షు డెబ్యూ .. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండనుంది అని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశలోకి కూరుకుపోయారు.
ఇక ఈసారి మోక్షు బర్త్ డే నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఎట్టకేలకు నందమూరి వారసుడి టాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. బింబిసార, విశ్వంభర చిత్రాలతో తన సత్తా చాటుకున్న యువ దర్శకుడు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ తన మొదటి సినిమాను చేయబోతున్నాడు. టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మోక్షు బర్త్ డే రోజున బాలయ్య, వశిష్ట, మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫోటోలను మేకర్స్ అధికారికంగా పోస్ట్ చేసి తమ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షకలు తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సరసన క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ 20 నిమిషాల పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించనున్నారని, ఆయన ఒక క్లాసిక్ మెలోడీ పాట రీమిక్స్‌లో మెరవబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. విజయదశమి పర్వదినాన అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్తతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.