సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నైట్ ఎఫెక్ట్ లో బాలకృష్ణ 111వ సినిమా యాక్షన్ ఎపిసోడ్

ABN, Publish Date - Mar 12 , 2026 | 11:10 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సాగుతోంది... నైట్ ఎఫెక్ట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు... ఆ ముచ్చటేంటో చూద్దాం...

నటసింహ నందమూరి బాలకృష్ణ )NBK)- గోపీచంద్ మలినేని (gopichand malineni) కాంబోలో కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ సాగుతోంది... నైట్ ఎఫెక్ట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు... ఆ ముచ్చటేంటో చూద్దాం... (NBK 111)


బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తోన్న మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ పై ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఈ మూవీ కోసం గచ్చిబౌలి అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. నైట్ ఎఫెక్ట్ లో ఈ షూటింగ్ సాగుతోంది. బాలయ్యతో పాటు కొందరు ఫైటర్స్, కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్స్ ఈ ఫైట్ షూటింగ్ లో పాలుపంచుకుంటున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్ కోసం జేసీబీ ట్రక్స్ ను ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ ఎపిసోడ్ ను 'జేసీబీ ఫైట్' అంటున్నారు యూనిట్ మెంబర్స్. ఈ ఎపిసోడ్ సినిమాకు ఓ హైలైట్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది...

మరిన్ని అంచనాలు...
బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమా 2023 పొంగల్ బరిలో హంగామా చేసింది. అందువల్ల బాలయ్య, గోపీచంద్ రెండో సినిమాపై అభిమానుల్లోనే కాదు ఇతర సినీ ఫ్యాన్స్ లోనూ మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్రసీమలో చోటు చేసుకున్న పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ కంట్రోల్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముందుగా అనుకున్న సబ్జెక్ట్ ను పక్కకు పెట్టి,  కొత్త కథను తయారు చేసుకున్నారు గోపీచంద్.. ఈ చిత్రాన్ని వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు... ఇందులో బాలయ్య జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలయ్యకు అచ్చివచ్చిన హీరోయిన్ గా నయన్ కు మంచి పేరుంది. అందువల్ల ఈ మూవీపై ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు చోటు చేసుకున్నాయి.

బాలయ్య బర్త్ డేన...
బాలయ్య 111వ చిత్రంగా గోపీచంద్ మూవీ తెరకెక్కుతోంది. 'ట్రిబుల్ వన్' నంబర్ కు ఓ ప్రత్యేకత ఉన్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జనరంజకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా టైటిల్  ను బాలకృష్ణ బర్త్ డే అయిన జూన్ 10వ తేదీన ప్రకంటించనున్నట్టు తెలుస్తోంది... ఇక ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సారి బాలయ్యకు గోపీచంద్ ఏ రేంజ్ హిట్ ను అందిస్తారో చూడాలి.

 

Updated Date - Mar 12 , 2026 | 11:11 PM