మొన్న అబ్బాయ్.. నేడు బాబాయ్.. కొరటాల ఏం చేస్తాడో
ABN, Publish Date - May 01 , 2026 | 12:52 PM
దేవర సినిమా తరువాత కొరటాల శివ (Koratala Siva).. దేవర 2 ని పట్టాలెక్కిస్తారేమో అనుకున్నారు. కానీ,దానికి సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.
దేవర సినిమా తరువాత కొరటాల శివ (Koratala Siva).. దేవర 2 ని పట్టాలెక్కిస్తారేమో అనుకున్నారు. కానీ,దానికి సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఈలోపు కొరటాల .. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కి ఒక కథను వినిపించారని, కథ నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా కొరటాల- బాలయ్య సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ 112 వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
తాజాగా NBK112 పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో సీరియస్ లుక్ లో బాలయ్య కనిపించారు. క్యాప్షన్ తోనే కొరటాల అంచనాలను పెంచేశారు. అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది అనే లైన్స్ సినిమా స్టోరీని తెలియజేస్తున్నాయి. కొరటాల సినిమా అంటే కచ్చితంగా సందేశం ఉండాల్సిందే. బాలయ్య సైతం.. అఖండ దగ్గరనుంచి సందేశాత్మకమైన సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిశారంటే మంచి సందేశంతోనే రాబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరి అబ్బాయ్ కి రెండు హిట్లు ఇచ్చిన కొరటాల.. బాబాయ్ కి ఎలాంటి హిట్ ని అందిస్తారో చూడాలి.