సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి.. అంతా నమ్రతదే హడావిడి

ABN, Publish Date - Nov 12 , 2026 | 05:28 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ - పద్మావతి దంపతుల కుమారుడు సిద్ధార్థ్ గల్లా (Siddharth Galla) వివాహ వేడుకలు ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో సందడిని నింపుతున్నాయి.

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ - పద్మావతి దంపతుల కుమారుడు సిద్ధార్థ్ గల్లా (Siddharth Galla) వివాహ వేడుకలు ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో సందడిని నింపుతున్నాయి. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్ కిమ్ (Hyein Kim) తో సిద్ధార్థ్ గల్లా నిశ్చితార్థం వైభవంగా ముగిసిన సంగతి తెల్సిందే. గతరాత్రి వీరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రెషన్స్ అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగాయి.ఈ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.


లైట్ గ్రీన్ కలర్ కుర్తా సెట్‌లో సిద్ధార్థ్ గల్లా మెరిసిపోతుండగా, ఆరెంజ్ ఫ్లోరల్ లెహంగా, నుదుటన తిలకంతో కొరియన్ వధువు హైన్ కిమ్ అచ్చమైన భారతీయ సంప్రదాయ లుక్‌లో అందరినీ ఆకట్టుకుంది. ఇక సిద్ధార్థ్ తల్లి గల్లా పద్మావతి, మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని, నమ్రత ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా నమ్రత డిజైనర్ డ్రెస్ తో ఈవెంట్ కే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


అయితే, ఎంతో ఘనంగా జరిగిన ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రెషన్స్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాలేదని తెలుస్తోంది. తన తదుపరి భారీ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ఆయన ఈ వేడుకకు రాలేకపోయారని సమాచారం. మహేష్ లేకపోయినా నమ్రత, కుటుంబ సభ్యులు అంతా కలిసి కొత్త జంటతో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు సిద్ధార్థ్ గల్లా - హైన్ కిమ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. మరి సిద్దార్థ్ పెళ్లి వేడుకకు అయినా మహేష్ అటెండ్ అవుతాడేమో చూడాలి.

Updated Date - Nov 12 , 2026 | 05:28 PM