సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లెనిన్ హిట్ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్.. ఏమన్నా చేశాడా

ABN, Publish Date - Jul 14 , 2026 | 08:24 PM

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. కేవలం 4 రోజుల్లోనే రూ. 61 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరడానికి చేరువ అవుతోంది.

Akkineni Nagarjuna

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. కేవలం 4 రోజుల్లోనే రూ. 61 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరడానికి చేరువ అవుతోంది. ఇక లెనిన్ ఇంత విజయం సాధించడం వెనుక నిర్మాతగా కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) అనుసరించిన అద్భుతమైన రిలీజ్ స్ట్రాటజీ ఉందంటూ ట్రేడ్ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా విడుదలకు ముందు ఆయన వేసిన ప్రతి అడుగు ఎంతో పక్కాగా లెక్కలతో కూడి ఉండటంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద లెనిన్ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా సాధించిన సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అటు అఖిల్ అక్కినేని కెరీర్‌కు ఎంతో అవసరమైన బూస్ట్‌ను అందించడమే కాకుండా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను కూడా తిరిగి లైమ్‌లైట్‌లోకి తెచ్చి ఇద్దరికీ సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు అక్కినేని నాగార్జున.


లెనిన్ విషయంలో నాగార్జున తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం.. థియేట్రికల్ రైట్స్‌ను చాలా రీజనబుల్ ధరలకే విక్రయించడం. ప్రతి స్టార్ హీరో సినిమాకు టికెట్ రేట్లను హైక్ చేయడం వలన డిస్ట్రిబ్యూటర్లపై భారం పడేది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పట్టేది. కానీ, నాగ్ థియేట్రికల్ రైట్స్‌ను చాలా రీజనబుల్ ధరలకే అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్లపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రతి ఏరియాలో బ్రేక్-ఈవెన్ టార్గెట్ చాలా సులభంగా మారింది. టార్గెట్ తక్కువగా ఉండటంతో అనుకున్న సమయం కంటే చాలా ముందే సినిమా బ్రేక్-ఈవెన్ వైపు దూసుకుపోతోంది. రికార్డు బిజినెస్ కోసం వెంపర్లాడకుండా, సురక్షితమైన విడుదలే లక్ష్యంగా నాగార్జున ముందుచూపుతో వేసిన ఈ ప్లాన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది.


ఇక దీంతో పాటు సింగిల్ రిలీజ్ చేయడం లెనిన్ కి బాగా కలిసొచ్చింది. ఎటువంటి పోటీ లేకుండా లెనిన్ రంగంలోకి దిగింది. జూన్ 19 న మా ఇంటి బంగారం రిలీజ్ అయ్యింది. మిగతా సినిమాలు రిలీజ్ అయినా అవేమీ నిలబడలేదు. అప్పటి నుంచి జులై 10 వరకు ఏ పెద్ద సినిమా రిలీజ్ కాలేదు. అది బాగా లెనిన్ కి కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు జూలై 24న రాబోతున్న చెన్నై లవ్ స్టోరీ వరకు బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద తెలుగు సినిమాలు లేకపోవడంతోఈ చిత్రానికి లైన్ క్లియర్‌గా దొరికింది. సోమవారం కలెక్షన్లలో సాధారణ తగ్గుదల కనిపించినప్పటికీ, గట్టి పోటీ ఏదీ లేకపోవడంతో వారపు రోజుల్లో కూడా ఈ సినిమా మంచి కలక్షన్స్ రాబడుతోంది అని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ రెండవ వీకెండ్‌లో కూడా ఇదే ఊపును చూపిస్తే, వీకెండ్ ముగిసే సమయానికి సినిమా వందకోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. మొత్తానికి నాగార్జున పక్కా ప్లానింగ్ ఒక సాదాసీదా రిలీజ్‌ను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా చేయడమే కాకుండా అఖిల్, భాగ్యశ్రీ జీవితాల్లో కొత్త జోష్ ని నింపింది.

Updated Date - Jul 14 , 2026 | 08:25 PM