నాగార్జున 100: నాగ్ సరసన హీరోయిన్లు ఎవరంటే..
ABN, Publish Date - Mar 28 , 2026 | 08:32 PM
నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలిసింది.
నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం తన 100వ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ‘కింగ్ 100’ (king 100) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నాగ్ సరసన నటించే హీరోయిన్‌గా ఎవరనేది విషయం క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్యా రాజేశ్‌ను ఇందులో హీరోయిన్‌గా అనుకుంటునట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు.. కథ నచ్చడంతో ఈ స్టోరీకి ఆమె ఓకే చెప్పిందని తెలిసింది. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టనుందని సమాచారం. ఐశ్వర్యా గ్లామర్ పాత్రలకన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటారు. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో పెద్ద హిట్ అందుకున్నారు.
మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ టబు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్, టబులపై కీలక సీన్స్ చిత్రీకరించారట. కథానుగుణంగా నాగార్జున ఇందులో మూడు గెటప్పుల్లో కనిపిస్తారట. దాంతో ముగ్గురు హీరోయిన్లలో ఓ పాత్రకు టబును సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. మరో హీరోయిన్ రోల్ కోసం ఐశ్వర్య రాజేష్‌ను అనుకుంటున్నారట. మూడో రోల్ కోసం ‘నాట్యం’ మూవీ ఫేం సుస్మితా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ ఫ్యాక్డ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.