సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. పిచ్చెక్కించాడు అంతే

ABN, Publish Date - Sep 12 , 2026 | 08:32 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొదలై వారం అయిపోయింది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తప్ప కంటెంట్ లేదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు

Bigg Boss

బిగ్‌బాస్ (Biggboss) తెలుగు సీజన్ 10 మొదలై వారం అయిపోయింది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తప్ప కంటెంట్ లేదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అన్నట్లుగా హౌస్ మారిపోయింది. వీరిద్దరి మధ్య వచ్చే చిల్లర గొడవలు ప్రేక్షకులను విసుగు పుట్టిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శనివారం అవుతుందా.. నాగార్జున వచ్చి వీరికి మాస్ క్లాస్ ఇస్తాడా అని అందరూ ఎదురుచూశారు. ఎట్టకేలకు శనివారం రావాదం.. బిగ్ బాస్ ప్రోమోలో నాగ్ అదరగొట్టడం జరిగిపోయాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున తన మార్క్ అగ్రెసివ్ క్లాస్‌తో హౌస్‌మేట్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు.


హౌస్‌లో బాగా ఆడి గెలిచిన ముగ్గురు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఇచ్చిన మిల్క్‌షేక్స్‌ను వారు తాగి పక్కన పెట్టగా, ఆ ఎంగిలి గ్లాసులను నాగార్జున స్వయంగా వేదికపైకి తెప్పించి, సబ్బు నీటితో స్వయంగా తోమి శుభ్రం చేసి స్టేజ్ పైనే కడిగి చూపించాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన స్వయంగా ఎంగిలి గ్లాసులు కడగడం చూసి హౌస్‌మేట్స్ తో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వీక్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన రోహిత్.. మీ ఎంగిలి ప్లేట్స్ నేను ఎందుకు కడగాలి. నా చేతులకు మాయిశ్చరైజర్ పోతుంది అన్న వ్యాఖ్యలకు.. నాగ్ ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాడు. 'ఏ పని చిన్నది కాదు, ఏ పని తక్కువది కాదు' అంటూ ఆయన ఎంతో గంభీరంగా స్పష్టం చేశాడు. నా చేతులకు మాయిశ్చరైజేషన్ లేదు, నేను ఎంగిలి గ్లాసులు ఎందుకు కడగాలి అనే చులకన భావాలు, అహంకారపూరిత ఆలోచనలు మనసులో ఉంటే అలాంటి వాళ్లు హౌస్‌లో ఉండడానికి వీల్లేదని నాగార్జున తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు.


ఇక రోహిత్ తాను వాడిన పదానికి క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ..'ఇక్కడ పదం ముఖ్యం కాదు, నీ ఆలోచనా విధానం, మనస్తత్వమే ప్రధానం' అని నాగ్ గట్టిగా తేల్చి చెప్పాడు. యూటెన్సిల్స్ క్లీనింగ్ డ్యూటీ నీది అయినప్పుడు బాధ్యతగా ఆ పని చేయకుండా, ఇతరుల ఎంగిలి గ్లాసులు నేను ఎందుకు కడగాలని అనుకోవడం సరైన పద్ధతి కాదని నాగార్జున హితవు పలికాడు. అంతేకాకుండా త్రిగుణ్ పై పిల్ల బచ్చా, స్టెరాయిడ్ డొల్ల అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోహిత్‌కి సత్వర శిక్షగా ఈత కొలను పక్కనున్న భారీ టైర్‌ను ఎత్తి గార్డెన్ ఏరియాలో తిరగాలని నాగార్జున ఇమీడియట్ పనిష్మెంట్ విధించి బిగ్‌బాస్ వేదికపై తన పవర్ ఏంటో చూపించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. స్టార్ హీరో అయినా కూడా ఇలా ఎంగిలి గ్లాసులు కడిగి కంటెస్టెంట్స్ కి బుద్ధి చెప్పిన విధానం బావుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 08:32 PM