సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: కింగ్ నాగార్జున

ABN, Publish Date - Aug 10 , 2026 | 08:53 PM

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

King Nagarjuna

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’ (Pallaburusu). ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాను చూడాలనే ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం ఆగస్ట్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున (King Nagarjuna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్న ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాం. నాన్న సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం. మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళబురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నేను చేస్తున్న ‘కింగ్ 100’ కూడా రాబోతోంది. ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ చాలా బిజీగా ఉంటుంది.


‘పళ్ళ బురుసు’ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నా తల్లిదండ్రులను నేను బాగా చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు బాగా చూసుకున్నారు. మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలి. అమల తన పేరెంట్స్‌ని అద్భుతంగా చూసుకుంటుంది. తనతో ఎప్పుడూ చెబుతుంటాను.. తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని. తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ముఖ్యం. ఉదయ్ నాకు కథ చెప్పినప్పుడు ఇదే విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఈ కథను అతను చాలా ఎంటర్టైనింగ్‌గా చెప్పాడు. సుధాకర్ రెడ్డి, శంభూ తాత పాత్రలో అద్భుతంగా చేశారు. మురళీధర్ గౌడ్ నటన కూడా చాలా బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చక్కని నటన కనబరిచారు. చాలా మంచి టీమ్‌వర్క్‌తో చేసిన సినిమా ‘పళ్ళబురుసు’. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్‌ను నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. పవన్ ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు కూడా వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.


కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్‌ సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే.. ఆ వెంటనే నేను తప్పకుండా కథ వింటాను. అన్నపూర్ణ కాలేజీకి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారు వచ్చినప్పుడు తెలంగాణ కల్చర్‌పై ఎందుకు ఒక సినిమా తీయకూడదని అడిగారు. ‘పళ్ళబురుసు’ తెలంగాణ కల్చర్‌కు సంబంధించిన మంచి కథ. ఆగస్ట్ 14న మా అమ్మగారి పుట్టినరోజు. ఇది నా బర్త్ డే మంత్ కాదు.. మా అమ్మ గారి బర్త్ డే మంత్. అమ్మానాన్నల ఆశీస్సులు ఈ సినిమాపై ఉంటాయని నాకు నమ్మకం ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

నా ఫ్యాన్స్ అలా పచ్చబొట్టు వేయించుకోండి: శరత్ కుమార్

మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. కనకరాజు కుమ్మేశాడు

నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు

Updated Date - Aug 10 , 2026 | 08:53 PM