సోగ్గాళ్లు.. మళ్లీ వస్తున్నారు
ABN, Publish Date - Feb 09 , 2026 | 09:37 AM
నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’ చిత్రాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి.
అక్కినేని నాగార్జున (Nagarjuna), నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకులుగా కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ (Soggade Chinni Nayana), ‘బంగార్రాజు’ (Bangarraju) చిత్రాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. వీరి కలయికలో మరో చిత్రం వస్తోందనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది.
తాజాగా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సోషల్‌మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ‘వాసివాడి తస్సాదియ్యా... వచ్చే ఏడాది జనవరి 15న సంక్రాంతి సందర్భంగా సోగ్గాళ్లు నటిస్తున్న చిత్రం వస్తే పండగ మరింత రంగులమయం అవుతుంది కదా. తేదీని మార్క్ చేసుకోండి’ అని పేర్కొంది.
దీంతో నాగార్జున, నాగచైతన్య వచ్చే సంక్రాంతికి రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించినవే.