సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒకే రోజు ముగ్గురు కింగ్స్.. డిసెంబర్ 24న బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు!

ABN, Publish Date - Oct 28 , 2026 | 09:34 AM

డిసెంబర్ 24న నాగార్జున ‘కింగ్ 100’, బాలకృష్ణ ‘దాదా’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయనే ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

king dada

డిసెంబర్ 24.. బాక్సాఫీస్ వద్ద ఈ తేదీ ఒక సరికొత్త రికార్డ్‌కు వేదిక కాబోతోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి ఇద్దరు కింగ్స్ రానున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. వీరు వేర్వేరు భాషలకు చెందినవారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna, Akkineni) సరిగ్గా ఒకే రోజు థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు. మరింత విశేషమేమిటంటే, ఇదే రోజున నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దాదా (Dada)తో బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్ల దగ్గర ట్రిపుల్ ధమాకా ఖాయమైంది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం కింగ్ 100 (King 100). తమిళ దర్శకుడు రా. కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. నాగ్ కెరీర్‌లో 100వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది.

ఇక బాలీవుడ్‌లో బాద్‌షా షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న 'కింగ్' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. ‘పఠాన్’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న మరో పవర్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా సరిగ్గా డిసెంబర్ 24నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'కింగ్ వర్సెస్ కింగ్' వార్ ఖాయమైంది.

ఈ ఇద్దరు కింగ్‌ల పోరు ఒకెత్తు అయితే... టాలీవుడ్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దాదా' చిత్రం కూడా అదే రోజు బరిలో దిగుతోంది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య మాస్ యాక్షన్, గోపీచంద్ మలినేని టేకింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున 'కింగ్ 100', బాలయ్య 'దాదా' నేరుగా పోటీ పడుతుండగా, పాన్ ఇండియా లెవెల్‌లో షారుఖ్ కింగ్ (King) తోడైంది. ఒకే రోజు ముగ్గురు స్టార్ హీరోలు ఇలా బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం నిజంగానే టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి ఈ క్లాష్ ఇలానే కొనసాగుతుందా? లేక ఎవరైనా తమ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకుంటారా? అనేది వేచి చూడాలి.

Updated Date - Oct 28 , 2026 | 09:34 AM