సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అఖిల్ కష్టాలు చూసి ఇంట్లో ఏడ్చాం.. వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున

ABN, Publish Date - Jul 11 , 2026 | 04:08 PM

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. 11 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

Nagarjuna

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. 11 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున (Nagarjuna) అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. అఖిల్, చైతన్యల సక్సెస్ కోసం అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, చివరకు లెనిన్ తో ఆ కల నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు అఖిల్ కోసం ఒక మంచి హిట్ ఇవ్వాలని తాను, హీరోయిన్ భాగ్యశ్రీ మొక్కుకున్నామని, ఆ దేవుడు తమ కోరికను నెరవేర్చాడని స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అడగ్గానే ఈ సినిమాకు అద్భుతమైన వాయిస్ ఓవర్ ఇచ్చిన తన పెద్దబ్బాయి ఎన్టీఆర్ కు నాగార్జున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏడాది క్రితం తండేల్, ఇప్పుడు లెనిన్ వరుసగా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.


ఇక ఈ సినిమా కోసం టీమ్ అంతా ఒక సైకోల్లా, హిట్ కొట్టాలనే కసితో పనిచేశారని నాగార్జున ప్రశంసించారు. నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్, మార్కెటింగ్ బాధ్యతలను భుజాన వేసుకుంటే.. డైరెక్టర్ నందు అద్భుతమైన డైలాగులతో సరస్వతీ పుత్రుడిలా మెప్పించాడన్నారు. ఈ టీమ్ వర్క్ చూస్తుంటే తనకు కూడా ఇలాంటి ఒక హిట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ కావాలనే జెలసీ కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బ్రిలియంట్ యాక్టింగ్‌తో తను ఆశించిన హిట్ అందుకుందని కొనియాడారు.


ఇక కొడుకు అఖిల్ గురించి మాట్లాడుతూ నాగార్జున కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అఖిల్ చిన్నప్పటి నుంచి విపరీతమైన ఎనర్జీతో ఉండేవాడని, డాక్టర్లు కూడా వాడిని నేలపై ఉంచమని చెప్పేవారన్నారు. సినిమాల కోసం వాడు ఎంతో కష్టపడ్డాడని.. గాయాలపాలైనా, ఆశించిన విజయాలు రాకపోయినా బాధను బయటకు చెప్పకుండా తనలో తానే కామ్ అయిపోయి ఆలోచించేవాడని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇంట్లోకి తన తోడు వచ్చాకే అఖిల్‌కు గుడ్ టైమ్ స్టార్ట్ అయిందని, అతని ఆలోచనా విధానం మారి ఈ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్తూ.. ఎస్.. అయ్యగారే నంబర్ వన్ అంటూ నాగార్జున స్పీచ్ ముగించడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 04:09 PM