Nagabandham: ‘నాగబంధం’.. నైజాం రైట్స్ ఎవరికంటే

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:51 AM

అభిషేక్ నామా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నైజాం రైట్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు.

Nagabandham Movie Still

అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ (Nagabandham). నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ కర్ణ (Abhishek Nama) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. ప్రమోషన్స్ నిమిత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. నైజాంలో ఈ సినిమాను ఆయన గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


మరోవైపు చిత్రబృందం సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమం ద్వారా సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను తెలియజేసి, సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నారు. ఈ టూర్‌లో భాగంగా తొలి కార్యక్రమం జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. అనంతరం జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ ప్రమోషనల్ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. విడుదలకు ముందు రోజు జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షో ను ఏర్పాటు చేయనున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!

ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

Updated Date - Jun 08 , 2026 | 12:51 AM