'లెనిన్' వెనక్కి… 'పెద్ది' ముందుకా..డేట్ వార్ లో చిక్కుకున్న నాగవంశీ
ABN, Publish Date - Mar 30 , 2026 | 07:11 PM
కొన్నిసార్లు అంతే.. అవతలి వారికి మంచి చేయాలనుకున్నా ఎదురు దెబ్బలు తప్పవు. పాపం టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీకి ఇప్పుడు అదే జరుగుతోంది.
కొన్నిసార్లు అంతే.. అవతలి వారికి మంచి చేయాలనుకున్నా ఎదురు దెబ్బలు తప్పవు. పాపం టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీకి (Naga Vamsi) ఇప్పుడు అదే జరుగుతోంది. తానేదో సాయం చేయాలని పోతే. చివరికి ఆ సాయానికి తానే చిక్కుల్లో పడుతున్నాడు. తిట్లు తింటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'పెద్ది' (Peddi) ఏప్రిల్ 30న విడుదల కాకపోవచ్చనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అందుకు తగ్గట్టే మేకర్స్ ఇంకా సైలెంట్‌గా ఉండటంతో ఇండస్ట్రీలో అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు 'పెద్ది' ఆ తేదీన రాకపోతే ఆ స్లాట్‌లో ఇతర నిర్మాతలు తమ చిత్రాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ విషయంపై 'పెద్ది' మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వకముందే అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న 'లెనిన్' (Lenin) మూవీ నిర్మాతలు మాత్రం తమ విడుదలను పోస్ట్ పోన్ చేసుకున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. 'లెనిన్' వాయిదాకు కారణం ఆఖిల్-చరణ్ మధ్య స్నేహం కారణమని మేకర్స్ చెబుతున్నారు. కొత్త విడుదల తేదీగా జూన్ 26ను ఖరారు చేశారు. ఇతర నిర్మాతలు 'పెద్ది' వాయిదా అని నమ్మకంగా ఉంటే.. ఒక్క నాగ వంశీ మాత్రమే 'పెద్ది' ఏప్రిల్ 30న వస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో నాగవంశీ ని ఒక వర్గం సోషల్ మీడియాలో విమర్శిస్తోంది.
'లెనిన్' వాయిదాకు కారణం.. రామ్ చరణ్ పై ప్రేమ కాదని.. ఆ సినిమా పనులు ఆలస్యం కావడం వల్లే వాయిదా పడిందని కొందరు నాగవంశీని విమర్శిస్తున్నారు. 'పెద్ది'కి దారి ఇస్తున్నట్లు చెప్పి మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలని ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపిస్తున్నారు. కాగా 'లెనిన్' ఆఖిల్ అక్కినేనికి చాలా కీలకమైన ప్రాజెక్టు. పదేళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటి వరకు ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. ఇంకా గట్టిగా విజయం రుచి చూడని ఆఖిల్ 'లెనిన్'పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.