సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగశౌర్య విడాకులు.. ఇదిగో క్లారిటీ

ABN, Publish Date - Sep 09 , 2026 | 06:35 PM

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య విభిన్నమైన సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. అయితే, గత కొంతకాలంగా నాగశౌర్య వెండితెరపై కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో కానీ పెద్దగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేశాయి.

Naga Shaurya

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) విభిన్నమైన సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. అయితే, గత కొంతకాలంగా నాగశౌర్య వెండితెరపై కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో కానీ పెద్దగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేశాయి. నాగశౌర్యకు ఏమైంది.. ? ఎందుకు సినిమాలు చేయడం లేదు.. ? అవకాశాలు లేవా.. ? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే ఆకకుండా కొంతమంది నాగశౌర్యకు భార్య అనూష శెట్టితో ఆయనకు తీవ్ర మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరూ విడివిడిగా దూరంగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా, వ్యక్తిగత జీవితంలో నెలకొన్న ఈ విభేదాల వల్లే నాగశౌర్య సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదనే పుకార్లు కూడా పుట్టించారు.


ఇక తాజాగా ఈ వార్తలకు నాగశౌర్య స్పందించకపోయినా.. ఆయన భార్య అనూష చెక్ పెట్టింది. డైరెక్ట్ గా చెప్పకపోయినా వారిద్దరూ కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేసి రూమర్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ జంట ఫ్రాన్స్‌లోని సుందరమైన ప్రదేశాలలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఇద్దరూ ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా కలిసి దిగిన ఫొటోలను పంచుకోవడంతో, వారిపై వస్తున్న విడాకుల పుకార్లన్నీ అవాస్తవాలని తేలిపోయింది.


ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని నాగశౌర్య 2022 నవంబర్ 20న వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట.. వేరుకాపురం పెట్టారు. ఈ విషయమై నాగశౌర్య తల్లి ఉష క్లారిటీ కూడా ఇచ్చింది. వేరుకాపురం గురించి పెళ్లికి ముందే మాట్లాడుకున్నామని, రిలేషన్స్ లో ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలంటే ఇదే మంచిది అని కూడా ఆమె చెప్పింది. పెళ్లి తరువాత నాగశౌర్య సినిమాలు చేయడం చాలా తగ్గించాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనూష కూడా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయకపోవడంతో ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత ఈ క్యూట్ కపుల్ మళ్లీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 06:35 PM