సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..

ABN, Publish Date - Jul 28 , 2026 | 04:18 PM

'నాకు ప్రేమకథలంటే ఎంతో ఇష్టం.  కొవిడ్ తర్వాత తెలుగు సినిమాల్లో ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డాను.

'నాకు ప్రేమకథలంటే ఎంతో ఇష్టం.  కొవిడ్ తర్వాత తెలుగు సినిమాల్లో ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డాను. ఇప్పుడు ప్రేక్షకులు ప్రేమకథలను ఇష్టపడతారా? అసలు థియేటర్లకు వస్తారా ? అని  ఆందోళనకు గురయ్యా. అయితే ఇప్పడు లవ్ స్టోరీ ట్రెండ్ మళ్లీ  మొదలయింది. 'చెన్నై లవ్‌ స్టోరీ'తో మంచి ప్రేమకథను అందించారు. అందుకు చాలా అందంగా ఉంది'  అని నాగ చైతన్య (Naga Chaitanya) అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా  రూపొందిన 'చెన్నై లవ్‌ స్టోరీ' విజయోత్సవ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. దీనికి లో ముఖ్య అతిథిగా హాజరైన  నాగచైతన్య చిత్రబృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఇప్పటి వరకు ప్రేమ, పెళ్లి చుట్టూ తిరిగే కథలు ఎక్కువగా చూసాం.  కానీ ఈ సినిమాలో బ్రేకప్ తర్వాత భావోద్వేగాలను కొత్త కోణంలో చూపించారు. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. సాయి రాజేశ్ ఈ కథను ఎంతో హృద్యంగా రాశారు. ఇలాంటి కొత్త తరహా ప్రేమకథలు మరిన్ని రావాలి.  ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న  హీరో కిరణ్ అబ్బవరం  ప్రయాణం స్ఫూర్తిదాయకం. 'క' సినిమా ఈవెంట్‌లో కిరణ్ చేసిన ప్రసంగం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. సినిమాపై అతని అంకితభావమే ఈ విజయానికి కారణం. శ్రీ గౌరీ ప్రియకు కెరీర్‌లో బెస్ట్  సినిమా ఇది.  నిర్మాత ఎస్‌కేఎన్‌, దర్శకుడు సాయి రాజేశ్ కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఏ  సినిమా విజయాన్ని అయినా బాక్సాఫీస్ కలెక్షన్లతో కొలవకూడదు.  ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ దక్కడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు' అని నాగ చైతన్య అన్నారు. 

Updated Date - Jul 28 , 2026 | 04:56 PM