స్వాగ్ ఆఫ్ అర్జున్.. వృషకర్మపై హైప్ తెచ్చేసిందిరా
ABN, Publish Date - Nov 07 , 2026 | 06:42 PM
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వృషకర్మ' (Vrushakarma). ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు (Kartik Dandu) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వృషకర్మ' (Vrushakarma). ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు (Kartik Dandu) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మాస్ అప్‌డేట్‌ను అందించారు. ఈ చిత్రంలోని స్వాగ్ ఆఫ్ అర్జున్ (Swag of Arjun) అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
ఈ పాటలో నాగచైతన్య పాత్ర తాలూకు స్వ్యాగ్, మాస్ యాటిట్యూడ్ ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేశారు. సినిమాలో హీరో అర్జున్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా, రగ్డ్ లుక్‌లో ఉండబోతుందో ఈ సాంగ్ ద్వారా తెలిపి హైప్ క్రియేట్ చేశారు. 'టైమ్స్ అప్.. వెన్ ఐ యామ్ ఇన్ ది ఫాస్ట్ నైట్' అంటూ సాగే ఈ పాటలోని ఇంగ్లీష్ లిరిక్స్, హై-ఎనర్జీ బీట్స్ ఆడియన్స్‌ను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ బి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన ట్యూన్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. విజువల్స్ లేకుండా కేవలం లిరికల్ వీడియో రూపంలోనే విడుదలైనప్పటికీ, ఈ సాంగ్‌లోని బీట్, హీరో బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.
దర్శకుడు కార్తీక్ దండు టేకింగ్, అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయని తాజాగా విడుదలైన స్వాగ్ ఆఫ్ అర్జున్ సాంగ్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి, వృషకర్మ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ మ్యూజికల్ ట్రీట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మేకర్స్ ఈ సినిమా నుంచి మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా, స్వాగ్ ఆఫ్ అర్జున్ పాటతో నాగచైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరిడిసెంబర్ 4 రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.