సమంత చేయలేని పని చేసిన శోభిత.. గాల్లో తేలిపోతున్న నాగచైతన్య
ABN, Publish Date - Jul 25 , 2026 | 03:46 PM
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సినిమాల విషయం పక్కన పెడితే చై పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాడు.
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సినిమాల విషయం పక్కన పెడితే చై పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాడు. సమంత (Samantha)తో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇలా నాలుగేళ్లలో ఎన్నో చూసిన చైతన్య.. శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ జంటను విడదీసింది.. ఒక కుటుంబాన్ని కూల్చేసింది.. సమంత కన్నా శోభిత ఎందులో గొప్ప అంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అయినా కూడా శోభిత వాటిని తట్టుకొని అక్కినేని కోడలిగా నిలబడింది. ప్రస్తుతం చై- శోభిత తమ వివాహ బంధంలో తమకు నచ్చినట్లు ఉంటున్నారు. వీరి గురించి ఏ వార్తా వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ గా మారిపోతుంది.
ఇక ఈ దంపతులు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తమ వ్యక్తిగత ముచ్చట్లతో నెటిజన్లను విశేషంగా అలరిస్తుంటారు. తాజాగా నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్‌లో భార్య శోభిత రెండేళ్ల తరువాత తనకు వంట చేసి పెట్టిందని ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశాడు. 'దాదాపు పెళ్లయిన రెండేళ్లకు నా భార్య నా కోసం వంట చేసింది.. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను" అంటూ నాగచైతన్య ఫన్నీ క్యాప్షన్ జోడించగా.. దానికి శోభిత ఫన్నీగా కౌంటర్ ఇచ్చింది. 'నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా?' అంటూ ఫన్నీ ఎమోజీలతో కౌంటర్ ఇవ్వడంతో ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. పెళ్లయి రెండేళ్లు అవుతున్నా శోభిత ఇప్పుడే వంట చేయడంతో చైతన్య గాల్లో తేలిపోతున్నాడు.
శోభిత వంట చేయడంతో.. చాలామంది సమంతను గుర్తుచేసుకుంటున్నారు. సామ్ కి వంట రాదు. ఈ విషయాన్ని చై- సామ్ ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారీ చై వండితే తింటాను అంటూ సామ్ చెప్పుకొచ్చింది. చై కోసం సామ్ వంట చేసిందో లేదో తెలియదు కానీ.. శోభిత మాత్రం వంట చేసి భర్త ప్రేమను దక్కించుకుంది. ఎంతైనా ప్రేమతో భార్య వంటను ఏ భర్త కాదనలేడు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.