సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Chaitanya: ఆ ప్రేమని సీరియస్ గా తీసుకోవద్దు..

ABN, Publish Date - Nov 22 , 2026 | 08:05 PM

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వృషకర్మ (Vrushakarma) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది.

Naga Chaitanya

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వృషకర్మ (Vrushakarma) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషన్ కంటెంట్ అంతా మంచి హైప్ తెచ్చుకుంది. ముఖ్యంగా విరూపాక్ష లాంటి భారీ హిట్ తరువాత కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి నుంచి వృషకర్మ డిసెంబర్ 4 నే రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈమధ్య ఈ సినిమా కూడా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ వార్తలో నిజం లేదని నాగ చైతన్య తన ప్రమోషన్స్ తోనే నిరూపిస్తున్నాడు.


ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన భార్య శోభిత గురించి, పెళ్లి తరువాత ఆయనలో వచ్చిన మార్పు గురించి మాత్రమే కాకుండా ప్రేమ, జీవితం గురించి యువతకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. శోభిత తన జీవితంలోకి వచ్చాక లైఫ్ చాలా మారిందని, ముఖ్యంగా తన ఫ్యాషన్ మారిందని చై చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లు ఏదైనా ప్లాన్ జరగకపోతే అప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతూ ముందుకు నడిపించే తీరు శోభితలో బాగా నచ్చుతుందని, నిర్ణయాలు తీసుకోవడం ఆమె నుంచే నేర్చుకున్నానని, తన ఆఫ్-స్క్రీన్ స్టైల్, ఫ్యాషన్ మారడానికి పూర్తి క్రెడిట్ తనకే ఇస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పెళ్లి తరువాత నుంచి శోభిత ఫ్యాషన్ తో తన వార్డ్‌రోబ్‌లో 20 శాతం మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో ఆ వార్డ్‌రోబ్‌ ని వందశాతం మారుస్తుందని తెలిపాడు. ఇక తన భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేమ.. లవ్ అది ఎప్పటికీ అర్ధం కాదు.. అదొక అందమైన అనుభూతి అంతే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


ఇక ఈ తరం జనరేషన్ కి ప్రేమ గురించి చెప్తూ.. టీనేజ్ లో చేసిన లవ్ ని సీరియస్ గా తీసుకోవద్దని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. తప్పులు చేయడం సహజమే కానీ, ఆ తప్పుల నుంచే పాఠాలు నేర్చుకొని మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని సలహా ఇచ్చాడు. ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని ఈజీగా తీసుకోవాలని, ఆ టీనేజ్ ప్రేమనే ప్రెషర్ లా ఫీల్ అవ్వొద్దని తెలిపాడు. ప్రస్తుతం చై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వృషకర్మ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 22 , 2026 | 08:09 PM