శోభిత బర్త్ డే.. స్పెషల్ గా విష్ చేసిన చైతన్య
ABN, Publish Date - May 31 , 2026 | 10:36 AM
అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు.
అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్ళ తరువాత విభేదాల వలన ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం చై లైఫ్ లోకి అడుగుపెట్టింది శోభిత ధూళిపాళ్ళ (Sobhita). తెనాలి అమ్మాయి అయినా కూడా బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శోభిత ప్రస్తుతం అక్కినేని పెద్ద కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
నేడు శోభిత తన 34 వ పుట్టినరోజును జరుపుకొంటుంది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు అందరూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య.. భార్య శోభితకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇద్దరూ కలిసి దిగిన రేర్ ఫొటోస్ ను షేర్ చేస్తూ... ' హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత.. నీతో కలిసి జీవితాన్ని గడిపే అవకాశం దక్కినందుకు నేను కృతజ్ఞుడిని' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
శోభిత సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది చీకటి అనే వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చింది. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం పలు కథలను వింటోందని, కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకొంటుందని సమాచారం. త్వరలోనే శోభిత కొత్త సినిమా ప్రకటన చేయనుందని టాక్. మరి పెళ్ళి తరువాత శోభిత మంచి హిట్ ని ఏ సినిమాతో అందుకుంటుందో చూడాలి.