బాహుబ‌లి వార‌సుడు.. స‌లార్ రాజు! మేము కాపులం.. వెబ్ సిరీస్‌ ట్రైల‌ర్

ABN , Publish Date - May 14 , 2026 | 04:00 PM

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, గెట‌ప్ శీను, ర‌వితేజ న‌న్నిమల‌, రీతూ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్ మేము కాపులం వెబ్ సిరీస్‌ ట్రైల‌ర్ విడుద‌లైంది.

Memu Coplam

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు (Naga Babu) , గెట‌ప్ శీను (Getup Srinu), ర‌వితేజ న‌న్నిమల‌ (Ravi Teja), రీతూ చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్ మేము కాపులం (Memu Coplam). త్వ‌ర‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో గురువారం ఈ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. గ‌తంలో విక‌ట‌క‌వి అనే సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇక తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫుల్ కామెడీ జాన‌ర్లో రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. గోదావ‌రి జిల్లా మహదేవపట్నంలో ఓ ఊరి పెద్ద గ‌జ‌ప‌తిరాజుకు సంబంధించిన పందెం కోడి (బాహుబ‌లి వార‌సుడు స‌లార్ రాజు) కోడి పందాలు స‌మీపిస్తున్న స‌మ‌యంలో మిస్ అవుతుంది. త‌న కోడి దొరికిన త‌ర్వాతే పందాలు అంటూ డిసైడ్ చేస్తాడు దీంతో ఊరి జ‌నం అంతా కోడి (స‌లార్ రాజు)ను వెతికే ప‌నిలో ప‌డ‌తారు. ఇందుకోసం అప్పుడే ఆ ఊరికి కొత్త‌గా వ‌చ్చిన కానిస్టేబుల్ సైతం ఎస్సైతో క‌లిసి ఆ కోడిని వెతికే ప‌నిలో ఉంటారు.

ఈ క్ర‌మంలో ఆ ఉర్లో ఎలాంటి ప‌రిణామాలు సంభ‌వించాయి. స‌లార్ రాజు క‌నిపించ‌క‌పోవ‌టం వ‌ల్ల‌..ఎవ‌రికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషణ స్టార్ట్ చేస్తారు. అయితే వారికి ఊళ్లో మ‌రో స‌మ‌స్య తెలియ వ‌స్తుంది. దీంతో వాళ్లు కొత్త స‌మ‌స్య నుంచి ఊరిని బ‌య‌ట‌ప‌డేయ‌టానికి ఎలా ప్ర‌య‌త్నించారు. ఇంత‌కీ మ‌హ‌దేవ‌ప‌ట్నంలోని ప్ర‌ధాన స‌మ‌స్య ఏంటి? పోలీసులు దాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తారు. అస‌లు ఇంత‌కీ స‌లార్ రాజు దొరికాడా? లేదా? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో సిరీస్ సాగ‌నుంది. మే 22 నుంచి జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - May 14 , 2026 | 04:00 PM