సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నెటిజన్‌కు నాగ్‌ అశ్విన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

ABN, Publish Date - Jul 13 , 2026 | 05:13 PM

‘కల్కి’ సినిమాలోని కర్ణుడి పాత్ర, క్లైమాక్స్‌పై వస్తోన్న విమర్శలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఫైర్‌ అయ్యారు. ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు దర్శకుడు.

‘కల్కి’ (Kalki) సినిమాలోని కర్ణుడి పాత్ర, క్లైమాక్స్‌పై వస్తోన్న విమర్శలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin) ఫైర్‌ అయ్యారు. ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు దర్శకుడు. ఆయన ఫైర్‌ అవ్వడానికి కారణమేంటంటే.. అక్కినేని అఖిల్‌ హీరోగా వచ్చిన ‘లెనిన్‌’ చిత్రంలో వసంత్‌ పాత్ర పోషించిన ప్రమోద్‌ పంజు నటనను అభినందిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. సకర్ణుడిని ఇలాగే చూపించాలి. కల్కి సినిమాలో కర్ణుడిని అతిగా చూపించారు, అసలు మహాభారతంలో లేని ఎన్నో అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దాంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. రచయిత వివేక్‌ దేబ్‌రాయ్‌ ఇంగ్లిష్‌లో అనువదించిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని షేర్‌ చేస్తూ ఆ నెటిజన్‌కు జవాబిచ్చారు.

‘ద్రోణ వధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. దయచేసి మీరు ఒకసారి మహాభారతం చదవండి. వివేక్‌ దేబ్‌రాయ్‌ అనువాదాన్ని చదవమని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఒకవేళ మీకు అది చదవడం కుదరకపోతే.. ‘శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడు’ అని గూగుల్‌ చేసి తెలుసుకోండి. మన చరిత్ర, పురాణాలపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. దయచేసి కల్కి పార్ట్‌ 2 కోసం ఎదురుచూడండి’ అని ఘాటుగా స్పందించారు.

Updated Date - Jul 13 , 2026 | 05:25 PM