సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nag Ashwin: మహానటి.. కల్కి చిత్రాలు తీసిన దర్శకుడేనా ఇతను!

ABN, Publish Date - Jun 07 , 2026 | 04:17 PM

సీనియర్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా  చిత్రం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham). జూన్‌ 11న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Director Nag Ashwin

సీనియర్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా  చిత్రం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham). జూన్‌ 11న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. సింగీతంపై ఉన్న గౌరవంతో..  ఈ చిత్ర నిర్మాత నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) నేలపై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన వీడియో  వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

చిన్న సినిమాల నటులు, దర్శకులే సెలబ్రిటీలుగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో మహానటి లాంటి అద్భుత చిత్రం, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కల్కి లాంటి పాన్ ఇండియా సినిమా చేసి, ప్రస్తుతం రెండో పార్ట్ చేస్తున్న నాగ్ అశ్విన్ సింప్లిసిటీని చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో హాజరైన ఈ ఈవెంట్లో గెస్టులకు  చోటు సరిపోకపోవడంతో నాగ్ అశ్విన్ వారి పక్కనే నేల మీద కూర్చుని, అందరికీ తన సింప్లిసిటీతో షాక్ ఇచ్చాడు.

Updated Date - Jun 07 , 2026 | 05:47 PM