సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓ మాతారే.. మాతారే.. మైసారే..

ABN, Publish Date - Nov 02 , 2026 | 10:08 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- రష్మిక మందన్న (Rashmika) పెళ్లి తరువాత కలిసి నటించిన చిత్రం రణబాలి. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Mysaa

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- రష్మిక మందన్న (Rashmika) పెళ్లి తరువాత కలిసి నటించిన చిత్రం రణబాలి. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈ సినిమా తరువాత రష్మిక లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా (Mysaa) రిలీజ్ కి సిద్దమవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసింది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట ఓ మైసా రే లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ మాస్ అండ్ ఇంటెన్స్ ఫోక్ ట్రాక్, ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. సుద్దాల అశోక్ తేజ అందించిన శక్తివంతమైన సాహిత్యం, సింధూజ శ్రీనివాసన్ అలపించిన ఉద్వేగభరితమైన గొంతు ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి.


గోండ్ తెగ నేపథ్యంలో సాగే ఈ కథలో రష్మిక ఒక పోరాట పటిమ కలిగిన గిరిజన యువతిగా కనిపిస్తుంది. ఈ పాటలో రష్మిక చూపించిన రౌద్ర రసం, కాళికా దేవిని తలపించేలా ఆమె చేసిన డ్యాన్స్ మూమెంట్స్, ఉగ్ర రూపం అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 02 , 2026 | 10:14 PM