Sai Pallavi: సీతమ్మను చూసినప్పుడు.. ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి

ABN , Publish Date - Oct 20 , 2026 | 09:29 AM

రామాయణం చిత్రం హిందీలో రూపొందిన‌ప్ప‌టికీ ప్రాప‌ర్ తెలుగు సినిమాలానే అంటుంద‌ని సాయి పల్లవి అన్నారు.

Sai Pallavi

రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor).. రావణుడిగా యశ్ (Yash).. సీతగా సాయి పల్లవి (Sai Pallavi).. ఈ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన‌ రామాయణం (Ramayana) చిత్రంఎలా ఉండబోతోందన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు పెంచిన ‘రామాయణం’ తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో చిత్ర బృందం తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేసింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ‘రామాయణ’ మూడేళ్ల జర్నీ అయినప్పటికీ, మా డైరెక్టర్, నిర్మాత పదేళ్ల క్రితం నుంచే ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ సినిమా మీకు ఒక ప్రాపర్ తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. నితీష్ గారు ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా, క్లారిటీగా డిజైన్ చేశారు. అలాగే నమిత్ గారి విజన్ చాలా గొప్పది. ప్రతి క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరాలనే గొప్ప ఉద్దేశంతో రూపొందించారు. నేను కూడా రామాయణం చూసి పెరిగాను. ఈ సినిమాలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కనెక్ట్ అవుతారు. దిల్ రాజు గారితో ‘ఫిదా’ సినిమా నుంచి జర్నీ ఉంది. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

రకుల్ గారు శూర్పణఖ పాత్రను అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రణ్‌బీర్ కపూర్ లాంటి గొప్ప యాక్టర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఆయనతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆయన చాలా కూల్‌గా ఉంటారు. ఎంతో పెద్ద మనసుతో పని చేశారు. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. అలాగే యశ్ గారి విజన్ కూడా ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న యాక్టర్ ఆయన.సీతమ్మ పాత్రను చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి. అదే నా కోరిక. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

Updated Date - Oct 20 , 2026 | 09:54 AM