ఫరియా.. పెళ్లి సాంగ్! మై సాంగ్.. బ్రైడ్ సాంగ్
ABN, Publish Date - Apr 03 , 2026 | 07:12 AM
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం'.
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తరుణ్ భాస్కర్ (Tarun Bhascker) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’(Gayapadda Simham). కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), మానస చౌదరి (Manasa Chowdary) కథానాయికలు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘బ్రైడ్ సాంగ్’ (Bride Song) ను చిత్ర బృందం విడుదల చేసింది.
పెళ్లికి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఫరియా అబ్దుల్లా ఈ పాటలో తనదైన శైలిలో నర్తించి మెప్పించారు. శ్రీమణి తెలుగులో సాహిత్యం అందించగా స్వీకార్ అగస్తీ స్వరకల్పనలో ఆంగ్ల సాహిత్యం అందించారు. మనీషా ఈరబత్తిని (Manisha Eerabathini) ఈ గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రానికి నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ ఎల్. ఉమేశ్ బన్సల్.