అశ్లీల సైట్‌లో.. నా ఫొటోలు అప్లోడ్ చేశారు
ABN, Publish Date - Apr 06 , 2026 | 09:36 AM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో తన టీనేజ్ సమయంలో జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు.
రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటిస్తున్న‘పెద్ది’ (Peddi) సినిమాలో అచ్చియ్యమ్మ పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తాజాగా జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో తన టీనేజ్ సమయంలో జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘దీనిని డీఫ్‌ఫేక్ అని అంటారో లేదో నాకు తెలియదు.
కానీ నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఓ అశ్లీల సైట్‌లో నా ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేశారు. నా క్లాస్‌మేట్స్ వాటిని చూశామని చెప్పడంతో ఆ క్షణం ఏం చెయ్యాలో తెలియలేదు. చాలా ఒత్తిడికి లోనయ్యా. ఆ సంఘటన వల్ల ఎంతో కలతచెందాను.
సోషల్‌మీడియాలో కనీస నైతికత లేదని అప్పుడే అర్థమైంది. ఎవరో చేసిన ఇలాంటి పనుల వల్ల మూల్యం చెల్లించుకోవాలి అని బాధపడ్డాను. డీప్‌ఫేక్ కారణంగా ఇప్పటికీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా. దీనివల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది.
కొన్ని అధికారిక వార్తా సంస్థలు కూడా నా ఏఐ ఫొటోలను ఒరిజినల్ అనుకుని వాడేస్తుంటాయి. ఇవి నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. దీనిపై ఒక్కోసారి గట్టిగా గొంతు విప్పి మాట్లాడాలని ఉన్నా.. నాకంత వాయిస్ లేదు అని అనిపించి ఆగిపోతుంటా’ అని పేర్కొన్నారు.