ముత్యమంతా పసుపు.. బంగారం వెర్షన్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 11 , 2026 | 03:33 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ జూన్ 19 న రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ జూన్ 19 న రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మునుపెన్నడూ లేని విధంగా మా ఇంటి బంగారం రికార్డ్ కలక్షన్స్ రాబట్టి సమంతను టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా మార్చేసింది. ఇక ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో, మేకర్స్ తాజాగా ఇందులోని మోస్ట్ పాపులర్ ముత్యమంతా వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ముత్యాల ముగ్గు సినిమాలో ముత్యమంతా పసుపు సాంగ్ ఎంత ఫేమసో అందరికీ తెల్సిందే. లెజెండ్రీ సింగర్ పి. సుశీల గాత్రం అందించిన ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటుంది. ఇక ఈ సాంగ్ ను మా ఇంటి బంగారం సినిమాలో విభిన్నమైన పల్లెటూరి వాతావరణం, కామెడీ ఎలిమెంట్స్‌తో రీమిక్స్ చేశారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ పాటకు తన మార్క్ అద్భుతమైన బిట్‌లను జోడించాడు. ఈ వీడియో సాంగ్‌లో సమంత, శ్రీముఖి రచ్చ అంతా ఇంతా కాదు. అత్తవారింట్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద కోడలు, రెండో కోడలు ఎలా అత్తగారిని మెప్పించారు అనేది ఈ సాంగ్ లో చూపించారు.
ఇక ఈ వీడియో సాంగ్‌లో సమంత తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. ఇటు పి. సుశీల గారి పాత మధురమైన పాట, అటు సంతోష్ నారాయణన్ మోడరన్ టచ్.. రెండు కలిసి ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్‌లోకి నెట్టేసాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. మరి థియేటర్ లో మెప్పించిన బంగారం ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.