సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొత్త టెక్నాలజీతో ‘బైకర్‌’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సౌండ్‌ ఎఫెక్స్ట్‌

ABN, Publish Date - Mar 16 , 2026 | 07:53 PM

‘బైకర్‌ (Biker) సినిమా మేకింగ్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుంది’ అని అన్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్.

Biker

‘బైకర్‌ (Biker) సినిమా మేకింగ్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుంది’ అని అన్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్ (Ghibran Vaibodha). శర్వానంద్ (Sharwanand), మాళవిక నాయర్ (Malvika Nair) జంటగా అభిలాష్‌ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) తెరకెక్కించిన చిత్రమిది. డా. రాజ‌శేఖ‌ర్ (Dr Rajashekhar) కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్‌, పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. మ‌రో 20 రోజుల్లో ఏప్రిల్‌ 3న 'బైకర్‌' ప్రేక్ష‌కుల ఎదుట‌కు రాబోతుంది.

ఈ సందర్భంగా జిబ్రాన్‌ మాట్లాడుతూ ‘మా సినిమా కథకు కుదిరేలా సంగీతం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. రేసింగ్‌ సన్నివేశాల్లో బైక్స్‌ నుంచి వచ్చే శబ్దాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ శబ్దాల వల్ల మ్యూజిక్‌ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సౌండ్‌ ఎఫెక్స్ట్‌, అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చేశాం’ అని అన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 09:07 PM