సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trivikram: ‘ఆదర్శ కుటుంబం’.. సంగీత దర్శకుడు మారాడు..

ABN, Publish Date - Apr 23 , 2026 | 12:50 PM

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! హౌస్‌ నంబర్‌ 47 అన్నది ఉపశీర్షిక.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! హౌస్‌ నంబర్‌ 47 అన్నది ఉపశీర్షిక. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలుత హర్షవర్దన్‌ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఆయన వైదొలగినట్లు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతోంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌  స్థానంలో ఎస్‌ఎస్‌ తమన్‌ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్‌ సంగీత చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల సెట్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరిగే షెడ్యూల్‌తో దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్టే తెలిసింది. జూన్‌ చివరి నాటికి వెంకటేష్‌ పోర్షన్‌ మొత్తం పూర్తవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. 

Updated Date - Apr 23 , 2026 | 03:21 PM