Mumaith Khan: మహిళ సాధికారితే ప్రధాన లక్ష్యం..
ABN, Publish Date - Jun 05 , 2026 | 07:48 PM
టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ బ్యూటీగా, ఐటమ్స్ సాంగ్స్‌కు కేరాఫ్ అయినా ముమైత్ ఖాన్ (Mumaith Khan) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ బ్యూటీగా, ఐటమ్స్ సాంగ్స్‌కు కేరాఫ్ అయినా ముమైత్ ఖాన్ (Mumaith Khan) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె వ్యాపారరంగంలోకి దిగారు. కొన్నాళ్ల క్రితం ఆమె ‘విలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ’ను ప్రారంభించారు. మహిళా సాధికారత ముఖ్య అంశంగా ‘విలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ’ ఆధ్వర్యంలో బ్యూటీ ఛాంపియన్‌షిప్, మెగా బ్యూటీ ఫెస్ట్-2026ను కండక్ట్ చేశారు. యూసఫ్‌గూడలోని సౌర్య కన్వెన్షన్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పాయల్ రాజ్ పుత్, దివి. ఆరియానా, రోల్ రైడా, చాందిని అతిథులగా హాజరయ్యారు. వారితోపాటు ఫ్యాషన్ రంగంపై ఆసక్తిగల మరో 300లకు పైగా హాజరయ్యారు.
బ్యూటీ రంగానికి సంబంధించిన సెషన్‌లను నిర్వహించారు. మే 28న విలైక్ అకాడమీలో నిర్వహించిన బ్యూటీ ఛాంపియన్‌షిప్‌లో మేకప్, హెయిర్ స్టైలింగ్, ఎయిర్‌బ్రష్ మేకప్, పీఎంయూ, నెయిల్ ఆర్ట్, చీర కట్టు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఫెస్ట్‌లో విజేతలకు సర్టిఫికెట్లు, గుర్తింపు, నెట్ వర్కింగ్ అవకాశాలు లభించాయి. ఫ్యాషన్ రంగంలో ప్రతిభ, విద్య, వ్యాపార అవకాశాలు, నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని విలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ అధినేత ముమైత్ ఖాన్ తెలిపారు.